చరిత్రలో నిలిచేలా బోయకొండ అభివృద్ధి

-ఎంపీ మిథున్ రెడ్డి సన్మానించిన చైర్మన్ మిద్దింటి శంకర నారాయణ
 
చౌడేపల్లె ముచ్చట్లు:
 
ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం లో జరుగుతున్న అభివృద్ధి చరిత్రలో నిలుస్తుందని చైర్మన్ మిద్దింటి శంకర నారాయణ అన్నారు. మంగళవారం ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని ఆమినిగుంట వద్ద సత్కరించారు రాష్ట్ర మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ,రాష్ట్ర వైకాపా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో బోయ కొండపై పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు .దినదినాభివృద్ధి చెందుతున్న బోయకొండ గంగమ్మ ఆలయంలో నభూతో న భవిష్యత్ అన్న విధంగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. వేలాదిగా వచ్చే యాత్రికుల సౌకర్యం కోసం పెద్దిరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలు వెచ్చించి నాణ్యతలో రాజీ పడకుండా అనేక కట్టడాలు భవన నిర్మాణాలు రహదారులు విద్యుత్ సౌకర్యం వంటి కార్యక్రమాలను వినూత్న రీతిలో చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. బోయకొండ అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో చైర్మన్ మిద్దింటి శంకర నారాయణ చొరవ అద్భుతమని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయనను అభినందించారు. యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గాల వైకాపా యువత వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు మిద్దింటి కిషోర్ బాబు ,బుడుగు భాస్కర్ రెడ్డి , ప్రసాద్ బాబు , వంశి ,వైకాపా నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: Boyakonda development to go down in history

Natyam ad