Boyconda's prestige is getting over.

బోయకొండ ప్రతిష్ట మంటగలిసిపోతోంది.

Date : 12/12/2017

– ఇష్టారాజ్యాంగా పరిపాలన
– పట్టించుకోని ఉన్నతాధికారులు
– ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

చౌడేపల్లె ముచ్చట్లు :

జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న బోయకొండ ప్రతిష్ట రోజురోజుకు దిగజారిపోతోంది. అధికారులు ఇష్టారాజ్యంగా పరిపాలన సాగిస్తుండటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు లెక్కలు లేకుండ ఖర్చు చేస్తున్నారు. అలాగే లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలు నిరుపయోగమైయ్యాయి. బోయకొండలో భక్తులకు సౌకర్యంగా రూ:50 లక్షల వ్యయంతో నిర్మించిన షాపింగ్‌ కాంప్లెంక్స్ రూములు నిరుపయోగంగా మారాయి.బోయకొండ ఆలయ కార్యాలయానికి కూతవేటు దూరంలో 37 రూములను రెండు బ్లాకులుగా విభిజించి నిర్మించారు. షాపింగ్‌ కాంప్లెక్స్ నిర్మాణపనులు పూరికావడంతో 2015 ఆగస్టు నెలలో ప్రారంభోత్సవం చేశారు.షాపింగ్‌ కాంప్లెక్స్లో గల రూములను అద్దెకు ఇవ్వడంతో ఆలయానికి అదనపు ఆదాయం చేకూరడంతో పాటు భక్తులకు అవసరమైన వస్తువులు సమకూర్చాలనే ఉద్దేశ్యంతో వీటిని నిర్మించారు. రూములు ప్రారంభించి 23 నెలలు గడుస్తున్నా అధికారులు మాత్రం ఏమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.నిర్మాణపనులు పూర్తికావడం, వ్యాపారులకు వాటిని కేటాయించకపోవడంతో వ్యాపారులు రోడ్లపైనే గుడారాలు వేసుకొని భక్తులకు అవసరమైన వస్తువులను విక్రయిస్తున్నారు. వర్షాలొస్తే వారి కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయని అప్పులుచేసి కొనుగోలు చేసిన విలువైన సామాగ్రికి నష్టం వాటిల్లితోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags : Boyconda’s prestige is getting over.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *