జిఈఎస్‌లో బ్రాహ్మణి, ఉపాసన, మంచులక్ష్మి

హైదరాబాద్‌ ముచ్చట్లు :

మదాపూర్‌ హెచ్‌ఐసిసిలో ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు కొనసాగుతోంది. ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రంప్‌ కూడ హాజరైయ్యారు. హెరిటేజ్‌ ఫుడ్స్ ఈడి నారాబ్రాహ్మణితో పాటు అపొలోఫౌండేషన్‌ వైస్‌చైర్‌పర్శన్‌ , సీనినటి మంచులక్ష్మి ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సు ప్రారంభానికి ముందు వీళ్లు ఓ చానల్‌తో మాట్లాడారు.

నారాబ్రాహ్మణి మాట్లాడుతూ…

ఈ సదస్సు మహిళలకు స్పూర్తినిస్తుందన్నారు. ప్రపంచలో చాలా అవకాశాలున్నాయని ఆ విషయం ఈ సదస్సుద్వారా తెలుస్తుందని ఆమె చెప్పారు. అన్ని సంస్థలోనూ మహిళలే డైరెక్టర్లుగా ఉండాలన్నారు. మహిళలకు స్వేచ్చ ఇస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆమె ఆశించారు.

మంచు లక్ష్మి మాట్లాడుతూ…

ఇలాంటి సదస్సు ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చన్నారు. ప్రపంచలోనే గొప్ప ప్రముఖ వ్యక్తుల్ని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సదస్సు వేదికగా అందరితో కలసి మాట్లాడడం గొప్పఅవకాశమన్నారు.

ఉపాసన మాట్లాడుతూ…

పారిశ్రామిక విధానంలో మహిళలకు ప్రోత్సాహం అవసరమన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నారు. మహిళలకు అవకాశమిస్తే ప్రపంచ స్థితిగతుల్నేమార్చేస్తారని చెప్పారు. అపొలో గ్రూప్‌లో మహిళలకే పెద్దపీఠ వేస్తున్నామని ఆమె అన్నారు.

 

Tag : Brahmani in the GES, Opposite, Snowlakshmi


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *