జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు

-మార్చి 1 నుండి 9వ తేదీ వ‌ర‌కు
 
తిరుపతి ముచ్చట్లు:
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 1 నుండి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
01-03-2022 ధ్వజారోహణం(మేష ల‌గ్నం) పెద్దశేష వాహనం
02-03-2022 చిన్నశేష వాహనం హంస వాహనం
03-03-2022 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
04-03-2022 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
05-03-2022 పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
06-03-2022 హనుమంత వాహనం గజ వాహనం
07-03-2022 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
08-03-2022 రథోత్సవం అశ్వవాహనం
09-03-2022 చక్రస్నానం ధ్వజావరోహణం
ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు. మార్చి 10న సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం జరుగనుంది.
 
Tags: Brahmotsavas at the Jubilee Hills Sri Venkateswaraswamy Temple

Natyam ad