కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాలు  

శ్రీకాళహస్తి ముచ్చట్లు:
 
మహా శివరాత్రి బ్రహ్మోత్స వాలలో సామాన్య భక్తుల దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని  ఇంజనీరింగ్ శాఖ వారిని సిబ్బందిని, సిబ్బందిని,శ్రీకాళహస్తి దేవస్థానం ఈ.ఓ పెద్దిరాజు  ఆదేశించారు.  శ్రీకాళహస్తి దేవస్థానం పరిపాలనా భవనం నందు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 8 వరకు జరిగే  మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వాహణ పై దేవస్థాన,సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహించారు. ఆలయం లోపల బయట అన్ని  క్యూలైన్లు వివిధ శాఖ అదికారులు  పరిశీలించారు, శ్రీకాళహస్తి డిఎస్పీ  విశ్వనాథ్, శ్రీకాళహస్త సీఐ శ్రీనివాసులు, ఎస్ ఐ ,సంజయ్ కుమార్   ఇతర శాఖలకు సంబందిం చిన అధికారులు మహా శివరాత్రిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు  శ్రీకాళహస్తి స్వామి వారిని దర్శించుకునేందుకు రావడం జరుగుతుందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని,  కోవిడ్ నిబందనలను అనుసరిస్తూ బ్రహ్మోత్సవాల నిర్వాహణ జరగాలని తెలిపారు. సామాన్య భక్తుల దర్శనానికి పెద్ద పీట వేస్తూ  ఎటువంటి ఆటంకం కలుగకుండా క్యూ లైన్ ల నిర్వహణ ఉండా లని, క్యూ లైన్ లో ఉండే భక్తులకు తాగు నీటికి సమస్య లేకుండా చూడాలని,దర్శనానికి వివిధ రాష్ట్రాల నుండి, ప్రాంతాల నుండి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున క్యూలైన్ లో తోపులాటలు జరగకుండా మరియు శ్రీకాళ హస్తి పట్టణంలో ట్రాఫిక్ ను నియంత్రిస్తూ వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పోలీసు శాఖ వారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పారిశుద్ధ నిర్వాహణ పక్కా గా చేపట్టాలని  దేవస్థానం సిబ్బంది మున్సిపల్ కమీషనర్ తో సమన్వయం చేసుకొని పని చేయాలని సూచించారు.ఎక్కడా  గాని విద్యుత్ కు అంతరాయం కలగకుండా ట్రాన్స్ కో వారు తగు చర్యలు చేపట్టాలని తేలిపారు.
 
Tags; Brahmotsavas on the night of Maha Shiva following the rules of Kovid

Natyam ad