పేదలను నిరాశపరిచిన బడ్జెట్ : టీటీడీపీ నేత రావుల 

Date:15/03/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రజల ఆలోచనలకు, ఆశలకు, ఆచారణలకు ఈటెల బడ్జెట్ లేదు.  ప్రతిపాదించిన బడ్జెట్ పొంతన లేకుండా ఉంది.  గతంలో ఇరిగేషన్ బడ్జెట్ లో పూర్తి బడ్జెట్ ఖర్చు చెయ్యలేదని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమ పథకాలకు నిధులు అనుకున్న స్థాయిలో లేదు. 2014 ప్రభుత్వం జరిపిన సర్వే లో 22లక్షల ఇండ్లు కావాలి అన్నారు…అన్ని కట్టాలి అంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి.  గొప్పగా చెప్పే గొఱ్ఱెలు,చేపల పంపకానికి అప్పులు చేస్తున్నారు.  ఆర్థిక మంత్రి బడ్జెట్ పేదల ఆశల పై నీళ్లు చల్లారని విమర్శించారు.  కేసీఆర్ సెక్రటేరియట్ లో పైరవి పై మాట్లాడిన మాటలతో మేము అంగీకరిస్తాం….మంత్రులు, సీఎం పోనప్పుడు పైరవీలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. * ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసిన సర్వీస్ కమిషన్ నియమాకాలను క్యాన్సల్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది.  కేసీఆర్ టిడిపి టీఆరెస్ మార్జర్ అయింది అంటూ మాట్లాడారు…అది పచ్చి అబద్ధమని రావుల అన్నారు.  పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలు చేశారు.  లోకేష్ ఎలాంటి అవినీతికి పాల్పడకపోయినా వ్యక్తిగత ఆరోపణలు చేశారని అన్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో పంచాయితీ రాజ్ కి అత్యధికంగా రేటింగ్ ఉందని అన్నారు.  లోకేష్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. టిటిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ కేసీఆర్ నిన్న ఎమ్మార్పీఎస్ మంద కృష్ణ మాదిగ పై మాటలను తీవ్రంగా కండిస్తున్నామన్నారు. ఆరోపణలు లేకుండా ఆ జాతి నేత అయిన రాజయ్య ను మంత్రి వర్గం నుంచి ఎందుకు తప్పించావో ఇప్పటి వరకు చెప్పలేని కేసీఆర్ కి మాట్లాడే అర్హత లేదు.  దేశ రాజకీయాల్లో కేసీఆర్ ని నమ్మేది ఎవరు…? కేసీఆర్ మాదిగ జాతిని చిన్నా భిన్నం చేస్తున్నారు.  కేసీఆర్ మాదిగ జాతికి ఏ విదంగా న్యాయం చేస్తారో చెప్పాలని అన్నారు.   ప్రజలకు ప్రజా పథకాలు అమలు చెయ్యను కేసీఆర్ ఏ విదంగా మాదిగ ఉద్యమానికి న్యాయకత్వం వహిస్తారో చెప్పాలని అన్నారు.  మంద కృష్ణ ప్రాణహాని బలపరిచే విదంగా కేసీఆర్ సభలో వ్యాఖ్యలు చేశారు.  పవన్ కళ్యాణ్ ఎమ్ మాట్లాడుతున్నారో ఆయాణకైనా అర్ధం అయితుందా అని అన్నారు.  పవన్ కళ్యాణ్ నాలుగు సంవత్సరాలు టిడిపి తో కలిసి ఉండి….రహస్య భేటీ తరువాత ఇలా మాట్లాడుతావా అని అడిగారు.  తెలంగాణ లో పర్యటన లో నేరళ్ల ఘటన పవన్ కళ్యాణ్ కి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.  కొండగడ్డు నుంచి యాత్ర ప్రారంభించిన పవన్ కి తెలంగాణ ప్రజల సమస్యలు కనిపించలేదా….?  చిరంజీవి తరహాలో  పవన్ కళ్యాణ్ కూడా అమ్మడు పోయారని ఆరోపించారు.
Tags: Budget disappointing budget: TDP leader

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *