బడ్జెట్ కసరత్తు .

హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు బ‌డ్జెట్ స‌మావేశాల‌పై ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు, శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి, సీఎంవో అధికారులు హాజ‌ర‌య్యారు.అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల తేదీల‌తో పాటు మండ‌లి స‌మావేశాల తేదీల‌ను కూడా కేసీఆర్ ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది. మార్చి నెలాఖ‌రు లోగా రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌ను ఆమోదించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో మార్చి రెండో వారంలో బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది.
 
Tags:Budget exercise

Natyam ad