Buldia's innovative ends to distinguish garbage

చెత్తలను వేరు చేయడానికి బల్దియా వినూత్న యత్నాలు

Date : 14/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఇంటింటి నుండి తడి పొడి చెత్తలను వేర్వేరుగా చేయడానికి గృహిణులకు బొట్టు, తిలకం పెట్టడం, స్వయం సహాయక మహిళలు, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులతో ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించడం తదితర వినూత్న కార్యక్రమాలను జిహెచ్‌ఎంసి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు బుధవారం చేపట్టారు. దేశంలో మరే మున్సిపల్‌ కార్పొరేషన్‌లో లేని విధంగా హైదరాబాద్‌ నగరంలో ఇంటింటికి రెండు డస్ట్‌బిన్‌ల చొప్పున 44 లక్షల డిస్ట్‌బిన్‌లను జిహెచ్‌ఎంసి అందజేసింది. ఈ డస్ట్‌బిన్‌ ద్వారా తడి, పొడి చెత్లను వేర్వేరుగా వేయడానికి పెద్దఎత్తున అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఇది పాక్షికంగానే జరుగుతోంది. అయితే తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయడం కేవలం పాశ్చత్య దేశాలలోని నగరాల్లోనే జరుగుతోంది. భారతదేశంలోని ఏ నగరంలోనూ చెత్తను వేర్వేరుగా సేకరించే విధానం అమలు జరగలేదు. కేంద్రప్రభుత్వం రూపొందించిన ఘన వ్యర్థాల నిర్వహణ చట్టం 2016ను పటిష్టంగా అమలు చేయడానికి జిహెచ్‌ఎంసి నిర్ణయించింది.

 

Tags : Buldia’s innovative ends to distinguish garbage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *