గ్రామ, సచివాలయ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

విజయవాడ  ముచ్చట్లు:
 
ఉద్యోగుల ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పందనపై రివ్యూ సందర్భంగా PRC, ఇతర హామీలపై స్పందించారు. ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటనలు చేశామన్నారు. పీఆర్సీ అమలు అన్నింటిపై ప్రకటనలు చేశామని, వాటిని వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగులకు మంచి జరగాలనే సర్వీసును పెంచామన్నారు సీఎం జగన్‌. యుద్ధ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఈ సందర్భంగా ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్‌ చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని, జూన్‌ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్‌. జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని స్పష్టం చేశారు. మిగిలిన 25శాతం ఉద్యోగులు ప్రొబేషన్‌ ఎగ్జామ్స్ కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, మార్చి ఫస్ట్ వీక్‌లో వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సీఎం జగన్‌ ప్రొబేషన్‌పై నిర్ణయం తీసుకున్నారు.
ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఏపీలో అమలు చేయనున్న పథకాలు, కార్యక్రమాలు:
జగనన్న చేదోడు ఫిబ్రవరి 8న (రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు లబ్ధి)
వైయస్సార్‌ ఇన్‌పుట్‌సబ్సిడీ ( తాజాగా వరదల్లో నష్టపోయిన రైతులకు.. ఒక సీజన్‌లో జరిగిన నష్టం.. అదే సీజన్‌లోగా ఇవ్వాలన్న లక్ష్యానికి అనుగుణంగా. డిసెంబరులో నష్టం జరిగితే.. ఫిబ్రవరిలో ఇస్తున్నారు)– ఫిబ్రవరి 15న జగనన్న తోడు (చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణం) ఫిబ్రవరి 22న ( ఇప్పటికే 10లక్షలకు వర్తింపు.. అదనంగా మరో 6 లక్షలమందికి వర్తింపు)మార్చి 8న విద్యా దీవెనమార్చి 22న వసతి దీవెన అమలు
 
Tags: Bumper offer for village and secretariat employees

Natyam ad