శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయానికి బస్సు

పుంగనూరు  ముచ్చట్లు:
 
మండలంలోని నెక్కుంది కొండలపై వెలసిన శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయానికి వెళ్లేందుకు భక్తులకు ఆర్టీసి బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్‌ సుధాకరయ్య ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరు, చౌడేపల్లె నుంచి రెండు బస్సులు ప్రతి రోజు కొండపైకి భక్తులను చేరవేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగా బస్సును కొండకు ట్రయల్‌ రన్‌ నిర్వహించామన్నారు. బస్సు రావడంతో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి , సర్పంచ్‌ నారాయణరెడ్డి, ఎంపీటీసీ భాస్కర్‌ , మాజీసర్పంచ్‌ రామనారాయణరెడ్డి బస్సుకు పూజలు చేసి హర్షం వ్యక్తం చేశారు.
 
Tags: Bus to Sri Agastheeswaraswamy Temple

Natyam ad