టీడీపికి  దూరమవుతున్న కేడర్

గుంటూరు ముచ్చట్లు:
 
గుంటూరు జిల్లాలో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉండే నియోజకవర్గాల్లో సిటీలోని పశ్చిమ సెగ్మెంట్‌ ఒకటి. దీంతోపాటు గుంటూరు నగరంలోనే ఉండే మరో నియోజకవర్గం ఈస్ట్‌. ఈ రెండుచోట్లా ప్రజా సమస్యలపై ప్రస్తుతం గట్టిగా పోరాడే నాయకులు లేరు. తూర్పులో పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు పట్టుమని పదిమంది రావడం లేదు. ఎప్పుడేం చేసినా ఒకటే ముఖాలు కనిపిస్తాయి. టీడీపీ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనలేని బిజీ ఆర్టిస్ట్‌లకు పదవులు కట్టబెట్టి.. పార్టీని నిర్వీర్యం చేశారన్నది తమ్ముళ్ల ఆవేదన. దీంతో ఎప్పటి నుంచో ఉన్న బలమైన క్యాడర్‌ను దూరమైంది.వార్డు కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిన నేతలు సైతం ప్రస్తుతం టీడీపీలో కనిపించడం లేదు. గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో వ్యక్తిగత అజెండాతో టికెట్లు ఇచ్చారని.. పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్లు సైలెంట్‌ అయ్యారు. జరుగుతున్న పరిణామాలు రుచించక మాజీ ఎంపీ లాల్‌జాన్‌ పాషా కుటుంబం పార్టీకి దూరం జరిగింది. ఫలితంగా తూర్పు నియోజకవర్గంలోని డివిజన్లలో టీడీపీకి ఓటమి తప్పలేదు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలో గెలిచిన నేతలు పార్టీ మారినా.. టీడీపీ చెక్కు చెదరలేదనే అభిప్రాయం తమ్ముళ్లలో ఉంది.2019 సాధారణ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమతోపాటు గుంటూరు ఎంపీ సీటును టీడీపీ గెల్చుకుంది.
 
 
 
ఆ తర్వాత గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే వైసీపీకి జైకొట్టారు. ప్రస్తుతం పార్టీలో బలమైన నాయకులు లేకపోవడంతో కార్పొరేషన్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో పది డివిజన్లను టీడీపీ గెల్చుకోలేకపోయింది. ఇందుకు నాయకత్వ సమస్యే అన్నది కేడర్‌ చెప్పేమాట. సమర్ధ నాయకత్వాన్ని అందించడంలో పార్టీ వైఫల్యం చెందిందా? అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. దీంతో కార్పొరేటర్లను.. పక్కపార్టీల నుంచి వచ్చిన నాయకులను ఇంఛార్జ్‌లుగా పెట్టుకుని టీడీపీ కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి ఉంది.గుంటూరు పశ్చిమలో కార్పొరేటర్‌ నాని టీడీపీ ఇంఛార్జ్. స్వతంత్రంగా పోరాడలేరని.. ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడలేరని నానిపై ముద్ర పడింది. పైగా ఆయన అన్ని పార్టీలతో ఫ్రెండ్‌షిప్‌ చేస్తారని ప్రచారం ఉంది. ఇప్పటికే నలుగురైదుగురు ఆశావహులు గుంటూరు వెస్ట్‌లో రెడీ అయ్యారు. ఎవరికి వారు పార్టీ తమకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని ప్రచారం చేసేసుకుంటున్నారట. అయితే ఆ ప్రచారాన్ని తెలుగు తమ్ముళ్లు నమ్మే పరిస్థితి లేదు. అలా అని ఉన్న ఇంఛార్జ్‌తో పార్టీకి భవిష్యత్‌ లేదన్నది వారి ఆవేదనప్రభుత్వంపై పోరాటం చేయలేని వాళ్లు.. టికెట్‌ ఇస్తే ఇండియాలో లేదా విదేశాలకు వెళ్లిపోయే వాళ్లు టీడీపీని ఎలా కాపాడతారని తమ్ముళ్ల ప్రశ్న. ఇప్పటికే గుంటూరు టీడీపీకి ఎంతో ఇచ్చిందని.. ఇకపై సమర్ధులైన నాయకులను ఇస్తే అండగా ఉంటామని కేడర్‌ చెబుతోందట. అయితే శ్రేణుల అభిప్రాయాన్ని టీడీపీ అధిష్ఠానం గౌరవిస్తుందా? లేక పాత రాగమే ఆలాపిస్తుందో చూడాలి.
 
Tags: Cadre moving away from TDP

Natyam ad