సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

Date:06/12/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
పాత బస్టీలని యాఖుత్ పురా నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ బూత్ లో తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, చాలా బూత్ లలో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సహదేవ్ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం కుర్మగూడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఎం ఐ ఎం నాయకులు ఏజెంట్లపై  దాడి చేసి తరిమేశారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆనంతయ్య, డివిజన్ అధ్యక్షుడు బండ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags:Case cameras should be set up

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *