ఏనుగు దాడిలో పశువులు మృతి

విజయనగరం ముచ్చట్లు:
 
విజయనగరం జిల్లా కోమరాడ మండలం గంగిరేగువలస గ్రామంలో పశువులపై ఒంటరి ఏనుగు దాడి చేసింది. ఆదివారం అర్ధరాత్రి గంగిరేగివలస గ్రామంలో నిద్రిస్తున్న ఆవులపై దాడి చేసింది. ఏనుగు దాడిలో రెండు ఆవులు మృతి చెందటంతో రైతులు, గ్రామస్తులు ఆందోళనలు చెందుతున్నారు. అర్ధరాత్రి ఏనుగు దాడి చేయడంతో భయాందోళనలో పడ్డారు. కొమరాడ మండలాన్ని ఏనుగులు వదలకపోవడంతో రైతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగులు ఇప్పటికే వందల ఎకరాల పంటలను నాశనం చేయడంతో ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి తరలించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
 
Tags: Cattle killed in elephant attack

Natyam ad