Celebrating 8th celebration

ఘనంగా వైకాపా 8 వ ఆవిర్భావ వేడుకలు

Date:12/03/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 8 వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీపీ ఆర్.విజయభాస్కరరెడ్డి ఆద్వర్యంలో వైసీపీ నాయకులు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత వారు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ‘వైఎస్సార్ అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు స్థానిక వైసీపీ కార్యాలయంలో కేకును కోసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన ప్రజా సంక్షేమ పాలన, విదానాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బాగారెడ్డి, జిల్లా కార్యదర్శి తమ్మిరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు శంకరప్ప, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డెప్ప, జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి సుహేబ్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి యరబల్లి శ్రీనివాసులు, కార్యదర్శి రవి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు శ్రీరాములు, బోయకొండప్ప, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: Celebrating 8th celebration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *