ఓయూలో సంబరాలు.

హైదరాబాద్  ముచ్చట్లు:
సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 91 వేల ఉద్యోగాలు ప్రకటించడంతో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఉద్యోగుల ప్రకటనను స్వాగతిస్తూ టిఆర్ఎస్వి, టిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ను బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకు వెళ్తున్న కేసీఆర్ కు విద్యార్థులు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలని 315 జీవోను ప్రవేశపెట్టి దాన్ని అమలు చేస్తూ ప్రకటన విడుదల చేయడం తద్వారా ఎస్సీ ఎస్టీ బిసి నిరుద్యోగులకు 10 సంవత్సరాల వయోపరిమితి పెంచడం హర్షణీయం అని తెలియజేశారు.
 
Tags:Celebrating in OU

Natyam ad