Celebrating the birthday of Vaikappa in Pallamenaaru

పలమనేరులో వైకాపా ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

Date:12/03/2018

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8 వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. పలమనేరు వైసీపీ కోఆర్డినేటర్లు రాకేష్ రెడ్డి, సీవీకుమార్, మొగసాల రెడ్డెమ్మ, కాపు నేత ఆకుల గజేంద్రప్రదాద్ ఆద్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వైఎస్సార్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో కేకును కోసి అందరికీ పంచి పెట్టారు. అనంతరం కోఆర్డినేటర్లు మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు ఆయన తనయుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రజలకు చేరువయ్యారని తెలిపారు. పార్టీ స్థాపించిన 7 సంవత్సరాల కాలంలో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వాటి పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ జగన్ తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారని వారు పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 7 సం.లు పూర్తి చేసుకుని 8 వ వసంతంలోకి అడుగు పెట్టడం చాలా సంతోషకరమని అన్నారు. రానున్న 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ గెలవడం ఖాయమని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వారు అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కూర్మాయి చెంగారెడ్డి, పట్టణ కన్వీనర్‌ మండీసుధ, మాజీ జెడ్పీటీసీ ప్రహ్లాద, కౌన్సిలర్ శ్యామ్ సుందర్, నాయకులు రమేష్, శశిదర్, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.

Tags: Celebrating the birthday of Vaikappa in Pallamenaaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *