శ్రీ గురు వైభవోత్సవాలలో పాల్గొన్న ప్రముఖులు..

మంత్రాలయం ముచ్చట్లు:
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వైభవో త్సవాలలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నాలుగో తేదీ ప్రారంభమైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి  గురు వైభవోత్సవాలు బుధవారం రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలతో  ఘనంగా ముగిశాయి. శ్రీ గురు వైభవోత్సవలలో పాల్గొనేందుకు దేశం  నలుమూలల నుండి ప్రముఖ రాజకీయ నాయకులు మంత్రులు సినీ కళాకారులు భక్తులు మంత్రాలయం కు వచ్చి రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. ఇందులో భాగంగా బుధవారం రాఘవేంద్ర స్వామి 427 వ జన్మదిన వేడుకలు సందర్భంగా రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకోవడానికి వైకాపా సీనియర్ నాయకులు సీతారామిరెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర విభాగం యువజన నాయకులు ప్రధీప్  రెడ్డి, వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జి విశ్వనాథ్ రెడ్డి రైల్వే శాఖ ఏడీజీపి. బాస్కర్ రావు ఇంకా పలువురు ప్రముఖులు హాజరయ్యారు వీరికి పీఠాధిపతులు శేష వస్త్రము  ఫల మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.
 
Tags:Celebrities participating in Sri Guru celebrations

Natyam ad