ప్రాణం తీసిన సెల్ ఫోన్ తగాదం.

– ముగ్గురు స్నేహితుల మధ్య చిచ్చు.
– హత్యకు దారితీసిన వైనం.
వికారాబాద్   ముచ్చట్లు:
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సెల్ ఫోన్ తగాదం ముగ్గురు మిత్రుల మధ్య చిచ్చుపెట్టి హత్యకు దారితీసిన వైనం ఇది. వివరాల్లోకి వెళితే పట్టణానికి చెందిన ప్రశాంత్, మల్ రెడ్డి పల్లి కి చెందిన రాజు అంతారం గ్రామానికి చెందిన జస్వంత్ ముగ్గురు స్నేహితులు. ప్రశాంత్ అనే యువకుడు సెల్ ఫోన్ దొంగలించి తోటి మిత్రులైన జస్వంత్, రాజులకు అప్పజెప్పి అమ్మి వేయాలని చెప్పడంతో ఇరువురు మిత్రులు అట్టి సెల్ఫోన్ను విక్రయించడానికి వెళ్లగా ఈ ఫోను దొంగ ఫోన్ అంటూ దుకాణ యజమానులు ఇద్దరు స్నేహితులను బెదిరించారు. దీంతో దొంగ సెల్ఫోన్ను తమకు ఇచ్చిన మిత్రుడు ప్రశాంత్ పైన ఆగ్రహం పెంచుకున్న మిత్రులు రాజు, జస్వంత్ మాట్లాడుతామని ప్రశాంత్ ని పిలిపించి పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామ శివారులో  నిర్మానుష్య ప్రదేశంలో బండరాయితో మోది హత్య చేసి అనంతరం నిందితులైన ఇద్దరు మిత్రులు జస్వంత్, రాజు స్థానిక తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో లొంగి పోయారు. లొంగిపోయిన ఇద్దరు నిందితులను పోలీసులు పెద్దేముల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
 
Tags:Cell phone fight that took a toll.

Natyam ad