కేంద్ర సహాయం అడిగాం : హరీశ్ రావు

Date:15/02/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
బచావత్ ట్రైబ్యునల్ అవార్డు తర్వాతనే కే.ఆర్.ఎం.బీ పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావాలి. అప్పుడే రాష్ట్రాలకు కేటాయించిన నీటిని విజయవంతంగా వినియోగించుకోవచ్చని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం అయన కేంద్రమంత్రులు నితిన్ గడ్కారి, హర్షవర్ధన్ లతో సమావేశమయ్యారు. ఈ వివరాలను అయన మీడియాకు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రులు గడ్కరీ, హర్షవర్దన్ లను ఆహ్వానించాను. ఏఐబీపీ కింద దేశవ్యాప్తంగా ఎంపికైన 99 ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని కోరామని అయన అన్నారు. భీమా, దేవాదుల ప్రాజెక్టులకు నిధుల మంజూరు చేయాలని సమావేశంలో కోరామని అన్నారు.
పర్యావరణ శాఖ మంత్రితో భేటీపై మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు పర్యావరణ, వన్యప్రాణి అనుమతులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి హర్షవర్దన్ను అడిగాం. పాలమూరు రంగారెడ్డి మొదటి దశ అటవీ అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చినందుకు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు చెప్పామన్నారు.
Tags; Central assistance asked: Harish Rao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *