ఏపీలో పనులపై కేంద్ర కమిటీ నివేదిక

Date:12/03/2018
గుంటూరు ముచ్చట్లు:
గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన హామీల పై, ఏ విషయం అడిగినా, మాకు లెక్కలు పంపలేదు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీలు) ఇవ్వలేదు అంటూ, కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు ఎదురుదాడి చెయ్యటం చూస్తున్నాం… వీరికి తోడు, రాష్ట్రంలో కొన్ని పార్టీలు, అటు కేంద్రాన్ని ఏమాత్రం నిందించకుండా, రాష్ట్రం మీద పడతారు… మేము లెక్కలు చెప్పాం అని డేట్ లు తో సహా చెప్పినా వినని పరిస్థితి.. ఎంత సేపు మోడీని ఒక్క మాట అనకుండా, చంద్రబాబుని ఇరికించాలి అనే పరిస్థితి… అయితే, వీరందిరికే, అదే కేంద్రం నుంచి వచ్చిన అధికారులు దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు…గత నెల 20, 21 తేదీల్లో అమరావతిలో పర్యటించిన కేంద్ర అధికారుల బృందం..రాజధాని నగర నిర్మాణ పనులప ట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసారు. యూసీలు ఇచ్చారంటూ లిఖిత పూర్వకంగానూ అంగీకరించారు. తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయ నిర్మాణ ప నులు పూర్తి పారదర్శకంగా జరిగాయని… రాజధాని నగరాభివృద్ధి సంస్థ చేసిన వ్యయాల నివేదికను ఆన్‌లైన్‌లో ప్రజలందరూ చూసేలా ఉంచిందని ధృవీకరించినట్లు సమాచారం. ఇదేసమయంలో..తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు కేంద్రంఇచ్చిన నిధులు రూ.1,500 కాకుండా..అదనంగా మరో రూ. 650 కోట్లు ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి ఈ బృందం సిఫారసు చేసింది.అలాగే మరో వెయ్య కోట్లుకు సంబదించి, గుంటూరు, విజయవాడ ప్రాంత పరిధిలో చేపడుతున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు నెమ్మదిగా నడుస్తున్నాయని ఈ బృందం పేర్కొంది. అయితే..ఇందుకు కారణాలనూ ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ఈ పనులకు ఆక్రమణలను తొలగించడం పెద్ద సమస్యగా మారిందని బృందం పేర్కొంది. ట్రాఫిక్‌ అవరోధాలనూ గుర్తించింది. పనుల్లో వేగం పెరగాలంటే.. ఆక్రమణలు తొలగించడం..ట్రాఫిక్‌ నియంత్రణ ప్రధానమైనవిగా సూచించినట్లు తెలుస్తోంది. రాజధాని నగరాభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన రూ.2,500 కోట్ల పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించిన కేంద్ర కమిటీ ఆ పనుల తీరుపట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసిందని చెబుతున్నారు.
Tags: Central committee report on work on AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *