ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదు

కాకినాడ ముచ్చట్లు:
 
రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీపై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ఎటువంటి పోలీసు అనుమతి లేదని మండపేట రూరల్ సీఐ శివగణేష్ ఆలమూరు ఎస్సై శివప్రసాద్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ జాతీయ రహదారి వద్ద రామచంద్రాపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు ఏర్పాటుచేసిన చెక్ పోస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  కరోనా కేసుల ఉద్ధృతినీ దృష్టిలో పెట్టుకొని,144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా అధిక సంఖ్యలో ప్రజలు గుమిగూడే నేపథ్యంలో చలో విజయవాడ  కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు, అలా కాకుండా పోలీసు వారి ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా అధిక సంఖ్యలో ప్రజలు ఒకేచోట గుమికూడినా.. విజయవాడ వెళ్లి నిరసన తెలపాలని చూస్తే  చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారు తెలియజేశారు.
 
Tags; Chalo Vijayawada program is not allowed

Natyam ad