Chandrababu Discussions on Budget

బడ్జెట్ పై చంద్రబాబు తర్జనభర్జనలు

Date:20/02/2018
విజయవాడ ముచ్చట్లు:
2018-19 బడ్జెట్‌ను ప్రణాళిక-ప్రణాళికేతర పద్దుల కింద విభజించడం లేదని, దీంతో ఆయా శాఖలు తమ అవసరాలకు తగ్గట్టు సమర్పించిన అంచనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అన్ని శాఖలు తమ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని సంపూర్ణ ఫలితాలు సాధించేలా కేటాయింపులు వుండాలని స్పష్టం చేశారు. సంక్షేమం-అభివృద్ధి సమతూకంగా బడ్జెట్ రూపొందిస్తే అందరికి ఆమోదయోగ్యంగా వుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్లు, కాపు-బ్రాహ్మణ కార్పొరేషన్లు, మైనారిటీ సంక్షేమం, వ్యవసాయం, వైద్య-విద్య రంగాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రతి కుటుంబం కనీసం నెలకు రూ. 10 వేల ఆదాయం ఆర్జించేలా తోడ్పాటు అందించేందుకు దోహదం చేయాలని అన్నారు.  2018 డిసెంబర్ నాటికి అన్నింటా స్పష్టమైన ఫలితాలు సాధించాలని లక్ష్యం నిర్ధేశించు కున్నందున ఇప్పుడు ప్రవేశ పెట్టే బడ్జెట్ చాలా కీలకం కానుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు వీలుగా ఏఏ శాఖలకు ఏమేరకు నిధులు అందించాలనే దానిపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. యువత-మహిళలకు మరింత ప్రోత్సాహం అందించాల్సి వుంటుందని అభిప్రాయపడ్డారు.రానున్న బడ్జెట్‌లో వివిధ శాఖలకు జరపాల్సిన కేటాయింపులపై ఆర్ధికశాఖ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు  సమీక్ష జరిపారు.
Tags: Chandrababu Discussions on Budget

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *