Chandrababu fires between caste with reservation name - BSP president Srinivas

రిజర్వేషన్ల పేరుతో కులాల మధ్య చిచ్చు పెడుతున్న చంద్రబాబు 

 – బీఎస్పీ అధ్యక్షుడు శ్రీనివాసులు
Date: 16/12/2017
వి.కోట ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులను బీసీ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తున్మామంటూ రిజర్వేషన్ల పేరుతో దళిత బహుజనుల కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడని బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాసులు విమర్శించారు. రాజకీయ లబ్దికోసమే చంద్రబాబు రిజర్వేషన్లను తెరమీదకు తెచ్చారన్నారు. సవరించిన రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో అమలు పరచుటకు ప్రభుత్వం జీవో విడుదల చేయకుండానే  వి.కోట తహశీల్దారు సుబ్రమణ్యం గోనుమాకులపల్లెకు చెందిన బివి.మంజునాథ్ అనే బీసీ కులానికి చెందిన వ్యక్తికి ఎస్టీ జాబితాకు చెందినట్టుగా సర్టిఫికేట్ మంజూరు చేశారని ఆరోపించారు. రాజ్యాంగంలోని 9,10,11,12 ఆర్టికల్స్ ప్రకారం కుల రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదం పొందిన తరువాత రిజర్వేషన్లు వర్తిస్తాయనే విషయం అధికారులకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా కుల రిజర్వేషన్ సర్టిఫికేట్లను జారీ చేస్తున్న తహశీల్దారు పై చర్యలు తీసుకోవాలని, విధులనుంచి తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇందుకు నిరసనగా బీఎస్పీ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు గణపతి, వినాయక, భారతి, అర్చన తదితరులు పాల్గొన్నారు.
Tag: Chandrababu fires between caste with reservation name – BSP president Srinivas 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *