పార్టీ వ్యూహాలపై చంద్రబాబు భేటీ

Date:12/04/2018
అమరావతి ముచ్చట్లు:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం మంత్రులు, వ్యూహ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. సమావేశంలో మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు, కాలవ శ్రీనివాసులు, ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, భూమా అఖిలప్రియ, కొల్లు రవీంద్రలతో పాటు కుటుంబరావు, టీడీ జనార్ధ న్, వీవీవీ చౌదరి పాల్గొన్నారుఈ సందర్బంగా తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.ఈ నెల 16 నుంచి నియోజకవర్గాల్లో చేపట్టే సైకిల్ యాత్రలు, బహిరంగ సభలపై కుడా చర్చించారు. ఈ నెల 20, 30 వ తేదీల్లో టీడీపీ రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది. ఈ నెల 20న దళితతేజం ముగింపు సందర్భంగా బహిరంగ సభ , తిరుపతి వేదికగా ఈ నెల 30న టీడీపీ బహిరంగ సభ నిర్వహించనుంది. తిరుపతి వేదిక సాక్షిగా నాలుగేళ్ల కిందట ప్రధాని మోడీ ఇచ్చిన హామీల అమలులో కేంద్రం వైఫల్యాన్ని ఆ సభలో ఎండగట్టాలన్న లక్ష్యంతో సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో సభకు సంబంధించి ఏర్పాట్లపై ఈ భేటీలో చంద్రబాబు నేతలతో లోతుగా చర్చించారు.
Tags:Chandrababu meeting party tactics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *