Chandrababu stopped Avinash Reddy's speech

అవినాష్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న చంద్రబాబు

Date;03/01/2018

పులివెందుల ముచ్చట్లు:

పులివెందుల జన్మభూమి సభలో టీడీపీ నేతలు బుధవారం ఓవరాక్షన్ చేశారు. గండికోట, చిత్రావతి ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగాన్ని టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డుకున్నారు. ఓ దశలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఆయనను చుట్టుముట్టి… చేతిలోని మైక్ను కూడా లాక్కునేందుకు యత్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఎంపీ పట్ల టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. సాక్షాత్తూ సీఎం కూడా అదే పంథాను అనుసరించారు. ఎంపీ అవినాష్ రెడ్డిని మాట్లాడనివ్వకుండా ఏయ్..మైక్ తీసుకో… ఇక్కడ ఏమీ మాట్లాడవద్దు అంటూ మైక్ కట్ చేయించారు. అంతేకాకుండా ఎవరేం చేశారో ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు, చెప్పదలుచుకున్న విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. అయితే చంద్రబాబు, టీడీపీ నేతల తీరుపై అవినాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అంతకు ముందు సభలో అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. గండికోట, చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించినా, ఆ ప్రాజెక్ట్కు సంబంధించి 85 శాతం పనులు పూర్తి చేయించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని అన్నారు. రూ.1300 కోట్లు వెచ్చించి 85 శాతం పనులు పూర్తి చేయించారని, పులివెందులను సస్యశ్యామలం చేసిన ఘనత వైఎస్ఆర్దేనని గుర్తు చేశారు. దివంగత నేత వైఎస్ఆర్ కృషిని ఎవరు మరువలేరని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.కాగా ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ.. బహిరంగ సభలో నిజాలు మాట్లాడకూడదా?. ఒక ఎంపీకి ఇచ్చే గౌరవం ఇదేనా?. అది తెలుగుదేశం సమావేశమా? లేక జన్మభూమి కార్యక్రమమా?అని ధ్వజమెత్తారు.

Tags ; Chandrababu stopped Avinash Reddy’s speech


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *