నిరాశ పరచిన చంద్రబాబు నిర్ణయం

Date:13/03/2018
విజయవాడ ముచ్చట్లు:
టిజి వెంకటేష్ రాజ్యసీటును కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారనే ప్రచారం వచ్చింది. ఇందుకు గాను ఆయన ఏకంగా రూ.70 కోట్ల వరకు పెట్టారనే వాదన లేకపోలేదు. ఫలితంగా అప్పటి వరకు ఉన్న పేర్లను పక్కన పెట్టి ఓసీకి చెందిన టిజికి సీటు కేటాయించారు. ఈ సారి అంతే జరిగింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక తీరు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది. సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్‌ ల ఎంపికపై రగడ రేగుతోంది. అభ్యర్థుల ఖరారును చివరి వరకు తీసుకువచ్చి… తాము ఎవరికి ఇవ్వదల్చుకున్నారో వారికి ఇచ్చేశారు. కాకపోతే మధ్యలో ఒక ట్విస్ట్ ఇచ్చారు. వర్లరామయ్యకు ఇస్తున్నట్లు లీక్ లు ఇప్పించి.. ఆ తర్వాత కాదన్నారు. గతంలో సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌లకు రాజ్యసభ సీట్లు ఇచ్చినప్పుడు, ఇలానే జరిగింది. పార్టీలో ఎప్పటి నుంచో ఉంటుున్న వారిని కాదని… కొత్తగా పార్టీలో చేరిన టీజీ వెంకటేష్‌కు సీటు ఇవ్వడం దుమారం రేపింది. రవీంద్ర కుమార్‌ను ఎంపిక చేస్తారని ఎవరూ ఊహించలేదు. అసలు ఆ పేరు ప్రచారంలోకి రాలేదు. కానీ అనూహ్యంగా ఆయన్ను ఎంపిక చేశారు. ఇందుకు పెద్ద మొత్తంలో ఆయన పార్టీ ఫండ్ ఇచ్చేందుకు ముందుకు రావడమే కారణమంటున్నారు. రాజ్యసభ స్థానంపై రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, నేతలు బీద మస్తాన్‌రావు, వర్ల రామయ్య, మసాల పద్మజ, నల్లగట్ల స్వామిదాసు, హేమలత, జూపూడి ప్రభాకర్‌, కంభంపాటి రామ్మోహనరావుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వర్ల రామయ్య, మసాల పద్మజ ఒకే సామాజిక వర్గం. కాబట్టి ఇద్దరిలో ఒకరికి కచ్చితంగా సీటు వస్తుందనుకున్నారు. ఇక జూపూడి ప్రభాకర్ పార్టీలో కొత్తగా చేరారు కాబట్టి సీటు ఇవ్వడం అంత తేలిక కాదనే విషయం ముందే ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి ఆయన విషయంలో వ్యతిరేక నిర్ణయం ఉన్నా.. పెద్దగా నేతలు పట్టించుకోవడం లేదు. గతంలోను ఎమ్మెల్సీ సీటు విషయంలో జూపూడికి వచ్చినట్లే వచ్చి చేజారిన సంగతి తెలిసిందే.  వర్ల రామయ్య పరిస్థితి మింగలేక కక్కలేక అన్న చందంగా మారింది. హైకమాండ్ ను కాదని చంద్రబాబు తీరును తప్పు పట్టలేరు. అలాయని మనసులో బాధను అణచుకోలేకుండా ఉండలేరు. అదే విషయాన్ని అనుచరులతో అంటున్నారు వర్ల రామయ్య. పార్టీ లైన్ కు వ్యతిరేకంగా నేను మాట్లాడలేను. వారు ఇస్తే తీసుకోవడం తప్ప ఎస్సీ సామాజిక వర్గం నేతలుగా మేము ఏం చేయలేమని చెబుతున్నారట. కంభంపాటి రామ్మోహన్‌రావు రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. రమేష్, రవీంద్ర విషయంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది. ఇద్దరి సీట్ల విషయంలో వంద కోట్లకు పైగా పార్టీ పండ్ పేరుతో డబ్బులు వచ్చాయనే వాదన చేస్తోంది వైరి వర్గం. ఇందులో నిజం ఎంత తెలియదు. కానీ రాజ్యసభ సీట్ల విషయంలో చంద్రబాబు నిర్ణయంపై ఆ పార్టీలోనే అసంతృప్తి నెలకుంది.
Tags: Chandrababu’s decision to be disappointed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *