Charge sheet on KCR soon: BJP

త్వరలో కేసీఆర్ పై చార్జ్ షీట్ : బీజేపీ

Date:09/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ముందస్తు ఎన్నికల్లో ఆదనపు భారం. ఆ ఖర్చు కు కేసీఆర్ యే కారణం. 2004 ,2006,2008,లో కూడా  గత ప్రభుత్వాలు ఇలానే చేశాయి. కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. సాండ్ మాఫియా తో ప్రభుత్వం చేతులు కలిపి షెడ్యూల్ కాస్ట్ యువకులను  జైళ్ళ లో పెట్టిన నెరేళ్ళ ఘటన..
ఉదాహరణ. ఓబీసీ లకు లక్ష కోట్లు 5 సంవత్సరా లు ఇస్తా అన్న కేసీఆర్ ఏమీ ఇచ్చారో చెప్పాలని అయన అన్నారు. 4500 రైతుల ఆత్మహత్యలు.. చేసుకుంటే,  కేవలం 450 మాత్రమే రైతుఆత్మహత్యలు గా రికార్డ్ చేసారు. రైతులకు ద్రోహం చేసిన  ప్రభుత్వం తెరాస ప్రభుత్వం. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని 30 వేలు మాత్రమే ఇచ్చారు.
పూర్తి ఆధారాలతో కేసీఆర్ ప్రభుత్వం పై చార్జ్ షీట్ రెడీ చేస్తామని అయన అన్నారు. బీజేపీ తెలంగాణ పై ప్రత్యేక దృష్టి పెట్టింది.  రెరండు లక్షల 50 వేలకోట్లలు తెలంగాణా కు ఇచ్చాం.  ఏమీ చేయబోతున్నామఅనేది, అమిత్ షా  సభలో వివరిస్తారని అయన అన్నారు. సభలో బీజేపీ తెలంగాణ కు ఏమీ ఇచ్చిందఅనేది ప్రజలకు వివరిస్తాం. రాహుల్ గాంధీ నాయకత్వము లో కాంగ్రేస్ అధికారం లోకి రాదు. కాంగ్రెస్ కు నీతి నిజాయితీ లు రానంతవరకు అధికారం లోకి రాదని అయన అన్నారు.
మావోయిస్టులకు మద్దతిస్తుంది కాంగ్రెస్. అధికార దాహం తోనే వేర్పాటువాదులతో కాంగ్రెస్ జత కడు తుందన్నారు. అవసరమైతే మోడీ ని ఓడించడానికి పాకిస్థాన్ తో అయినా.. కాంగ్రెస్ జట్టుకడుతుందని విమర్శించారు. తెరాస ను అధికారం నుండీ తప్పించాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయకండి. రోహింగ్యాలను హైదరాబాద్ నుండి పంపింవేయడం ఎంఐఎం, తెరాస  కు ఇష్టం లేదు.విజన్ తెలంగాణ కోసం బీజేపీ ముందుకు సాగుతోందని అయన అన్నారు.
Tags; Charge sheet on KCR soon: BJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *