చిక్కిన చండిమాల్: శ్రీలంక 373 ఆలౌట్

దిల్లీముచ్చట్లు:
భారత్తో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక పోరాటం ముగిసింది. ఓవర్నైట్ స్కోరు 356/9తో నాలుగో రోజు, మంగళవారం ఆట ప్రారంభించిన పర్యాటక జట్టు 135.3 ఓవర్లకు 373 పరుగులకు ఆలౌట్ అయింది. లంక సారథి దినేశ్ చండిమాల్ (164; 361 బంతుల్లో 21×4, 1×6) కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. వరుస బౌండరీలు బాది వూపు మీద కనిపించిన అతడు ఇషాంత్ శర్మ వేసిన 135.3వ బంతికి థర్డ్మ్యాన్ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న ధావన్కు చిక్కాడు. సండకన్ (0; 20 బంతుల్లో) అజేయంగా నిలిచాడు. లంకపై భారత్ 163 పరుగుల ఆధిక్యంలో ఉంది.రెండో ఇన్నింగ్స్లో భారత్ ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరం. టాప్ ఆర్డర్ ధావన్, మురళీ విజయ్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ నిలిస్తే ప్రత్యర్థి ముందు దాదాపు 450-550 వరకు లక్ష్యం నిర్దేశించవచ్చు. ఇక ఐదోరోజు మొత్తం లంకను కుప్పకూలిస్తే విజయం భారత్ వశం అవుతుంది.
Tag: Chekkina Chandimal: Sri Lanka’s 373 all out


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *