Chicken wings

చికెన్ ధరలకు రెక్కలు

Date:31/12/2018
నెల్లూరు ముచ్చట్లు:
పండుగుల రోజుల్లో చికెన్‌ ధరలు అమాంతంగా పెరగడంతో నగరంలోని మాంసం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. స్కిన్‌ లెస్‌ చికెన్‌ కిలో రూ. 200కు చేరింది. వారం రోజులుగా ఇదే ధర కొనసాగుతోంది. డిసెంబర్‌ 1న కిలో స్కిన్‌ లెస్‌ చికెన్‌ ధర రూ. 160 మాత్రమే. దాదాపు నెల రోజుల క్రితంతో పోలిస్తే కిలోకి రూ. 40 పెరిగింది. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల నాటికి దీని దర మరి కాస్త పెరిగే వీలుందని బ్యాగ్‌ నిర్వాహాకుడు డి ఆదినారాయణ తెలిపారు. కోళ్ల ధాణాగా ఉపయోగించే మొక్కజొన్న ధర పెరగడం, చలి తీవ్రత, పండగలు కారణంగా చికెన్‌ ధరలు పెరిగటానికి కారణాలుగా ఆయన చెప్పారు.
గత ఏడాది కూడా క్రిస్మస్‌, నూతన సంవత్సరం, సంక్రాంతి రోజల్లో కిలో రూ. 200గా అమ్మకాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. పండగలు, చలి కారణంగా చికెన్‌ వినియోగం అధికంగా ఉంటుందన్నారు. సంక్రాంతి తర్వాత ధరలు తగ్గే వీలుందన్నారు.చికెన్‌ డిసెంబర్‌ 1న లైవ్‌ కిలో రూ. 77, డ్రెస్‌డ్‌ రూ. 99, స్కిన్‌ లెస్‌ రూ. 160, ధర ఉండగా 8న లైవ్‌ రూ. 90, డ్రెస్‌డ్‌ రూ. 150, స్కిన్‌లెస్‌ రూ. 160గా ఉంది. 15న లైవ్‌ రూ. 92, డ్రెస్‌డ్‌ రూ. 154, స్కిన్‌లెస్‌ రూ. 170 ఉండగా, 22న లైవ్‌ రూ. 108, డ్రెస్‌డ్‌ రూ. 157, స్కిన్‌లెస్‌ రూ. 178గా ఉంది. 24వ తేదీ నాటికి ఒక్కసారిగా చికెన్‌ ధరలు బాగా పెరిగాయి. లైవ్‌ రూ. 122, డ్రెస్‌డ్‌ రూ. 175, స్కిన్‌ లెస్‌ రూ. 200కి చేరింది. అవే ధరలు నేటి వరకు కొనసాగుతున్నాయి.
Tags:Chicken wings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *