బాలయ్య నిరసన

హిందూపూర్ ముచ్చట్లు:
 
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ప్రకటన అనంతరం రాజకీయ వేడి రాజుకుంది. తమ ప్రాంతం పేరుతో జిల్లాను ప్రకటిం చాలని ఇప్పటికే పలు జిల్లాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ముఖ్యంగా అనంతపురం జిల్లా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాం డ్ బాగా వినిపిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే సైతం హిందూపురం జిల్లా ఉద్యమానికి మద్దతు పలికిన విషయం తెలిసిందే. దీనిపై బాలకృష్ణ మరో ఉద్యమానికి నాంది పలికారు. ఈ మేరకు హిందూ పురం లో బాలకృష్ణ మౌనదీక్ష చేపట్టా రు. ముందు పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వరకు టీడీపీ శ్రేణులు, జిల్లా మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్ కూడలిలో బాలకృష్ణ మౌన దీక్ష కు కూర్చున్నారు.ఈ సందర్భంగా బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటిం చకపోతే.. వైసీపీ ప్రజా ప్రజాప్రతినిధు లు రాజీనామా చేయడానికి సిద్దమేనా అంటూ సవాల్ విసిరారు. హిందూ పురం కేంద్రంగా జిల్లాను ప్రకటించా ల్సిందేనని బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
Tags: Childish protest

Natyam ad