.7800 కోట్లతో మైనారిటీ సంక్షేమ పథకాలు

-ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష
 
కాకినాడ ముచ్చట్లు:
 
ముస్లిం, మైనార్టీల శ్రేయస్సుకు వైకాపా ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.7,800 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా వెల్లడించారు.మంత్రులు విశ్వరూప్‌, వేణుగోపాలకృష్ణతో కలిసి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. స్థానిక పోలీసు రిజర్వు లైనులో రూ.2 కోట్లతో నిర్మించిన మసీదును ప్రారంభించారు. తర్వాత ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా మాట్లాడుతూ, గత తెదేపా ప్రభుత్వ హయాంలో ముస్లిం, మైనార్టీలకు రూ.2,500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వైపు ఇతర రాష్ట్రాల సీఎంలు చూస్తున్నారని అన్నారు. మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వానికి మైనార్టీలు, ఎస్సీలు రెండు కళ్లు వంటి వారన్నారు. తెదేపా హయాంలో ముస్లింలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags; Chrore with Minority Welfare Schemes

Natyam ad