పుంగనూరులో నేరేడు చెట్టు కోసం ఇరువర్గాల ఘర్షణ

పుంగనూరు ముచ్చట్లు:
 
ఒక నేరేడు చెట్టు కోసం ఇరువర్గాలు ఘర్షణ పడటంతో పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేసిన సంఘటన ఆదివారం జరిగింది. మండలంలోని పూజగానిపల్లెలో మహేష్‌కు చెందిన నేరేడు చెట్టును చంద్రశేఖర్‌ నాయక్‌ కొనుగోలు చేశారు. దీనిని కొట్టి , ఇంటి వద్ద ఆటోలో వేస్తుండగా అదే గ్రామానికి చెందిన మునిరాజ , అతని కుమారుడు రామాంజులు ఘర్షణ పడి ఇరువురు గాయపడ్డారు. ఈ సమయంలో వీరిరువురు బలోరో జీపుతో చంద్రశేఖర్‌నాయక్‌, నాగరాజు లను గుద్దిచంపే ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ గంగిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేసి మునిరాజు, అతని కుమారుడు రామాంజులుపై ఎస్సీ, ఎస్టీ సెక్షన్లతో పాటు హత్యాప్రయత్నం సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్‌నాయక్‌ పైన సాధారణ కేసు నమోదు చేశారు. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags; Clash of two factions for apricot tree in Punganur

Natyam ad