జిల్లా కలెక్టర్లతో సీఎం సమావేశం

అమరావతి ముచ్చట్లు:
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి  బుధవారం నాడు జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో  కోవిడ్ నివారణ చర్యలు, ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలు, సంపూర్ణ గృహహక్కులు, ఉపాధిహామీ, సుస్థిరాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. పీఆర్సీ అంశంపై మాట్లాడుతూ పీఆర్సీ అమలు సహా, ఉద్యోగులకోసం కొన్ని ప్రకటనలు చేశాం. కోవిడ్ కారణంగా మరణించిన ఫ్రంట్లైన్ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇవ్వడంపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. కారుణ్య నియామకాలు చేయమని చెప్పాం. యుద్ధ ప్రాతిపదికన వారికి కారుణ్య నియామకాలు ఇవ్వాలని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను వినియోగించుకోవాలి. ఇతర విభాగాల్లో ఉద్యోగాలంటే ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అలాంటి సమస్యలు లేకుండా యుద్ద ప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇవ్వాలని అన్నారు. జూన్ 30లోగా కారుణ్య నియామకాలు చేయాలని ఆదేశించారు. జగనన్న స్మార్ట్టౌన్ షిప్స్లో 10శాతం స్థలాలను, 20 శాతం రిబేటుపై కేటాయించాం. ఎంఐజీ లే అవుట్స్లో వీరికి స్థలాలు ఇవ్వాలి. వారికి స్థలాలు కేటాయించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలి.
 
 
స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్ చేయాలి. దీనివల్ల డిమాండ్ తెలుస్తుంది. మార్చి 5లోగా స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్చేయాలి.ఉద్యోగులే కాకుండా.. స్థలాలు కోరుతున్నవారి పేర్లను కూడా వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు.కోవిడ్ నివారణ చర్యలపై సీఎం మాట్లాడుతూ కోవిడ్ నివారణకు ఇదివరకు ఉన్న ఆంక్షలను కొనసాగిస్తున్నాం. మరో 2 వారాలపాటు రాత్రిపూట కర్ఫ్యూను, ఆంక్షలను కొనసాగిస్తూ ఇప్పటికే అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. కచ్చితంగా ఈ ఆంక్షలను అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆరోగ్యశాఖలో 39 వేలమందిని నియమిస్తున్నాం. ప్పటివరకూ 27 వేలమందిని రిక్రూట్చేశాం.మిగిలిన వారికి ఈనెలాఖరులోగా నియమించాలి. డాక్టర్లు లేరు, నర్సులు లేరు, పారామెడికల్సిబ్బంది లేరనే మాట రాకూడదని అన్నారు.
 
Tags: CM meeting with District Collectors

Natyam ad