ఉక్కు కర్మాగారం స్థాపించేవరకూ ఆమరణ నిరాహార దీక్షరాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌

Date:20/06/2018
కడప ముచ్చట్లు:
కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం స్థాపించేవరకూ ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తానని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ స్పష్టంచేశారు. ఉక్కుకర్మాగారం స్థాపన కోసం ఎమ్మెల్సీ బీటెక్‌రవితో కలిసి జడ్పీ కార్యాలయం వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు. ఉక్కు పరిశ్రమ రాకుండా కేంద్రం అడ్డుపడుతోందని ఆయన మండిపడ్డారు. జిల్లాలో పరిశ్రమ సాధ్యం కాదని సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ వేసినా.. ప్రతిపక్ష నేత జగన్ ఒక్కమాటా మాట్లాడకపోవడం విచారకరమన్నారు. ఉక్కు పరిశ్రమ సాధన కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని బీటెక్‌ రవి చెప్పారు. దీక్ష చేస్తోన్న నేతలకు సంఘీభావంగా తెదేపా నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో దీక్ష స్థలికి తరలివచ్చారు. అంతకుముందు సీఎం రమేశ్‌ కడప నగరంలోని మహాత్మా గాంధీ, ఎన్టీ రామారావు, అంబేడ్కర్‌, కోటిరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉక్కు కర్మాగారం కోసం 350 రోజుల నుంచి ఆర్సీపీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారం నిర్మిస్తామంటూ చెప్పి ఇప్పుడు సాధ్యం కాదని చెప్పడం సరికాదన్నారు.
ఉక్కు కర్మాగారం స్థాపించేవరకూ ఆమరణ నిరాహార దీక్షరాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌http://www.telugumuchatlu.com/cm-ramesh-a-member-of-the-hunger-strike-in-telangana-until-the-steel-factory-was-established/
Tags:CM Ramesh, a member of the hunger strike in Telangana until the steel factory was established

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *