ఆదిలాబాద్ జిల్లా లో చలి పంజా

అదిలాబాద్ ముచ్చట్లు:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది జిల్లాలో చలి గాలులు వీస్తుండటంతో రాత్రి, పగటి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండి  పగలు కూడా చలిగా తీవ్రత  ఉంటోంది. పల్లె పట్నం
అనే తేడా లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాతావరణ శాఖ వెల్లడించిన మేరకు  రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయిన పది ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలొనే ఉన్నాయి  తెల్లవారుజాము నుంచి కమ్మేసిన పొగమంచు ఉదయం 9 గంటలైనా వీడటం లేదు. రాత్రి వేళ బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ఏడు గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.అర్లి(టి) లో అత్యల్పంగా 5.7 డిగ్రీలు,  తలమడుగు, సొనాల, బేల, భోరజ్ ,సిర్పూరు(యు)  గిన్నెదరి. తిర్వాణి. కెరమెరి. ప్రాంతాల్లో తదితర ప్రాంతాల్లో 8 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..ఈ నెల30వ తేదీ వరకు చలి తీవ్రత ఉంటుందని  వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Cold claw in Adilabad district

Natyam ad