రాజకీయాల్లోకి వస్తా: రజనీ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా కొత్త పార్టీ స్థాపిస్తా
అభిమానులతో సమావేశంలో ప్రకటించిన తలైవా

ఈనాడు.

Date : 31/12/2017

చెన్నై: రాజకీయ రంగ ప్రవేశంపై కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తెరదించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. చెన్నైలో ఆరో రోజు అభిమానులతో సమావేశమైన రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టత ఇచ్చారు.దేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని… వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లోగా కొత్త పార్టీ స్థాపిస్తానని, తమ పార్టీ 234 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని తెలిపారు. డబ్బు, పదవి ఆశతో మాత్రం రాజకీయాల్లోకి రావడం లేదన్నారు.

స్తుతం రాజ్యం ఏలుతున్న పార్టీలు ప్రజలకు దోచుకుంటున్నాయి. నేనురాజకీయాల్లోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మూడేళ్లలోనే రాజీనామా చేస్తాను. నేను ఏర్పాటు చేయబోయే పార్టీ నిజం, పని, అభివృద్ధి అనే మూడు మంత్రాలతో నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ చెడిపోయింది. తమిళనాడు రాష్ట్రం గురించి ఇతర రాష్ట్రాలు హేళన చేసి మాట్లాడుతున్నాయి. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం నేను ఇప్పుడు తీసుకోకపోతే పెద్ద తప్పు చేసినవాడినవుతాను. ప్రజాస్వామ్యం పేరిట కొందరు రాజకీయ నాయకులు ప్రజలను దోచుకుంటున్నారు. రాజకీయాలు నాకు కొత్తేం కాదు. 1996లోనే నేను రాజకీయాల్లో ఉన్నాను’ అన్నారు.

Tags : Come to politics: Rajani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *