అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు పోటీలు

తిరుపతి ముచ్చట్లు:
 
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా సోమవారం ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. మార్చి 2 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. మార్చి 4వ తేదీ ఉదయం 10 గంటలకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో సంగీతంలో పోటీలు నిర్వహిస్తారు. సంక్షేమాధికారి  దామోదరం ఆదేశాల మేరకు సూపరింటెండెంట్   శ్రీవాణి ఈ పోటీలను పర్యవేక్షిస్తున్నారు.
 
Tags:Competitions for women employees on the occasion of International Women’s Day

Natyam ad