పోటాపోటీగా టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు
తిరుపతి ముచ్చట్లు:
టిటిడి ఉద్యోగుల క్రీడలు శనివారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానం, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో పోటాపోటీగా జరిగాయి. విశ్రాంత మహిళా ఉద్యోగుల బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీల్లో పుష్పకుమారి, నిర్మల కృష్ణన్ జట్టు విజయం సాధించగా, లలితమ్మ, సుమతి జట్టు రన్నరప్ గా నిలిచింది. విశ్రాంత పురుష ఉద్యోగుల బ్యాడ్మింటన్ పోటీల్లో చంద్రశేఖర్ రాజు జట్టు విజయం సాధించగా, దేవదాస్ జట్టు రన్నరప్ గా నిలిచింది. 45 ఏళ్లలోపు మహిళా ఉద్యోగుల షటిల్ సింగిల్స్ పోటీల్లో సరస్వతి విజయం సాధించగా, మహాలక్ష్మి రన్నరప్ గా నిలిచారు. 45 ఏళ్లలోపు మహిళా ఉద్యోగుల షటిల్ డబుల్స్ పోటీల్లో సరస్వతి, చిన్నమునెమ్మ జట్టు విజయం సాధించగా, స్వప్న మంజరి, విజయలక్ష్మి జట్టు రన్నరప్ గా నిలిచింది. 45 ఏళ్లు పైబడిన మహిళా ఉద్యోగుల షటిల్ సింగిల్స్ పోటీల్లో పద్మ విజయం సాధించగా, సుగుణమ్మ రన్నరప్ గా నిలిచారు. 45 ఏళ్లు పైబడిన మహిళా ఉద్యోగుల షటిల్ డబుల్స్ పోటీల్లో సుగుణమ్మ, పద్మ జట్టు విజయం సాధించగా, రమాదేవి, అనూరాధ జట్టు రన్నరప్ గా నిలిచింది.
Tags: Competitive TTD employee sports