త్వరితగతిన ఉపాధి హామీ పనులు పూర్తిచేయాలి- జిల్లా కలెక్టర్ జి.రవి.

-వేసవి దృష్ట్యా మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు.
-ప్రతి జాబ్ దారుడికి విధిగా ఉపాధి కల్పించాలి.
-ఎంపీడీవోలు క్షేత్ర స్థాయిలో పరిశీలించే వివరాలు నమోదు చేయాలి.
-సిసి రోడ్ల పనులు 7 రోజుల్లో పూర్తి చేయాలి.
-ఉపాధిహామీ కార్మికులను ఈ శ్రామ్ లో నమోదు చేయాలి.
-ఉపాధి హామీ పనులు, మొక్కల సంరక్షణ సంబంధిత అంశాలపై రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్.
జగిత్యాల ముచ్చట్లు:
జిల్లాలో ఉపాధి హామీ కింద మంజూరు చేసిన పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఉపాధి హామీ పనులు ,మొక్కల సంరక్షణచర్యల పై ఎంపీడీవోలు,  మండల పంచాయతీ అధికారులు ఏపీవో లతో గురువారం ఐఎంఏ హాల్లో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల కింద మంజూరుచేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో నాటిన అవెన్యూ ప్లాంటేషన్ సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలనికలెక్టర్ ఆదేశించారు.
మండలాల వారీగా ఉపాధిహామీ లేబర్ టర్న్ ఔట్ పై కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. గ్రామాల వారీగా పరిశీలించి అధిక సంఖ్యలో ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ఆదేశించారు.
ఉపాధిహామీ కింద మంజూరు చేసి ప్రారంభించిన సిసి రోడ్ల నిర్మాణ పనులు 7 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో ఉపాధి హామీ కూలీల అందరిని తప్పనిసరిగా ఈ శ్రామ్ లోనమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని కలెక్టర్ సూచించారు. డిమాండ్ ఉన్న ఉపాధి హామీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్
సూచించారు.ప్రతి గ్రామంలో హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, మొక్కలు నీరు లేక చనిపోవడానికి వీల్లేదని, నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం తప్పనిసరిగా85% మేర మొక్కలు సంరక్షణ జరగకపోతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.ఉపాధి హామీ పనుల కింద మెటీరియల్ చెల్లింపులో మార్చి 31 లోగా  పూర్తి చేయాలనికలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ఎంపీడీవోలు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ఉపాధి హామీ పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
ఇంచార్జిఅదనపు కలెక్టర్ వినోద్ కుమార్ ,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వినోద్ కుమార్ ,జిల్లా పంచాయతీ అధికారి ,అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు ,మండలపంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు.
 
Tagss:Complete employment guarantee works should be completed- District Collector G.Ravi

Natyam ad