Complete the toilet constructions quickly

మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితంగా పూర్తి చేయండి

Date:28/02/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగమైన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితంగా పూర్తి చేయాలని ఎంపీపీ మురళీకృష్ణ, జెడ్పీటీసీ సులోచన కోరారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో ఇప్పటికీ మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టలేదని పేర్కొన్నారు. అసంపూర్తిగా వున్న మరుగుదొడ్లను, నిర్మాణాలు చేపట్టని మరుగుదొడ్లను గుర్తించి మార్చి నెల చివరికల్లా వాటి నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రన్ని బహిరంగ మల మూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటరత్నం, తహశీల్దారు సురేంద్రబాబు, వివిద శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

 

Tags: Complete the toilet constructions quickly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *