మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయండి – ఎంపీపీ మురళీకృష్ణ

పెద్దపంజాణి ముచ్చట్లు:
స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీపీ మురళీకృష్ణ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మురళీకృష్ణ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణం లో వెనుకబడిన లబ్ధిదారులను గుర్తించి వారికి మరుగుదొడ్ల వాడకంపై అవగాహన కల్పించి వారు మరుగుదొడ్లను నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్పంచులు,ఎంపీటీసిలు,జన్మభూమికమిటీలు అధికారులతో  కలసి నిర్దేశిత లక్ష్యాలను త్వరితంగా పూర్తి చేయాలని సూచించారు.అనంతరం ఆయన హౌసింగ్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఉపాదివంటి విభాగాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సులోచన,వైస్ఎం పీపీ సుమిత్ర, ఎంపీడీఓ వెంకటరత్నం, తహశీల్దారు సురేంద్ర, ఎస్సై చంద్రమోహన్, సర్పంచులు,ఎంపీటీసీలు,కార్యదర్శులు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Tag: Complete the toilets of the toilets – MPP Muralakrishna


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *