విద్యార్ది సంఘాల అందోళన

-పలు ప్రాంతాల్లో పోలీసుల మోహరింపు
 
కాకినాడ ముచ్చట్లు:
 
గురువారం  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యార్థి సంఘలు కలక్టరేట్ ల ముట్టడి,  ధర్నా కార్యక్రమాలకు సిద్దమైన నేపధ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.  ఈ అందోళన కార్యక్రమాలకు ఎటువంటిఅనుమతులు లేవని అధికారులు అంటున్నారు. , తూర్పుగోదావరి జిల్లా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో  చెక్ పోస్టులను, పీకెట్ లను ఏర్పాటు చేసి  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండాచర్యలు తీసుకున్నారు.   విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనకుండా సంబంధిత పోలీసు అధికారులు  వారివారి పరిధిలో కళాశాలలో ట్రైనింగ్ సెంటర్లు విద్యా సంస్థలలో,ఆర్టీసీ బస్ స్టాప్ లు,  రైల్వే స్టేషన్ల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు  ఎటువంటి అనుమతి లేని చట్టవ్యతిరేక ధర్నా కార్యక్రమాలలో పాల్గొనకుండా చర్యలు చేపడుతున్నారు.ముందస్తు భద్రత చర్యలలో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసారు.
 
Tags: Concern of student unions

Natyam ad