జీయర్ వ్యాఖ్యలపై అందోళన

హైదరాబాద్ ముచ్చట్లు:
రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్దంగా  ఆహారపు అలవాట్లుపై చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు హైదరాబాద్ లో ఆందోళనకు దిగాయి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పలు ప్రజా సంఘాల నాయకులు ట్యాంక్ బండ్ పై ఉన్నఅంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి చిన్న జీయర్ స్వామికు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనాదిగా ఆదివాసుల , గిరిజనులు , నిమ్న వర్గాల జీవనశైలికి అనుగుణంగా వారి , వారి ఆహార అలవాట్లు ఉన్నాయని… వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని , మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tag:Concern over Zeyer comments

Natyam ad