కేంద్ర ప్రభుత్వ పథకాలపై వృద్ధులకు అవగాహన సదస్సులు – పిటిఆర్‌ఆర్‌ఎం అధ్యక్షులు గుండాల రామక్రిష్ణయ్య

చౌడేపల్లె ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై వృద్ధులకు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు పిటిఆర్‌ఆర్‌ఎం అధ్యక్షులు గుండాల రామక్రిష్ణయ్య తెలిపారు. జాతీయ స్థాయిలో 486 కోట్లతో 60 ఏళ్లకు పై బడిన వృద్ధులకు ప్రత్యేక శిభిరాల ద్వారా ఉపకరణాలు అందజేసేందుకు కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ ప్రభుత్వ పథకాలను వృద్ధులకు అందించేందుకు , వారిలో పథకాల పట్ల చైతన్యం కలిగించేందుకు డిసెంబర్‌ 5 న చిత్తూరులోని పీసిఆర్‌ ప్రభుత్వ పాఠశాలలో, అదే రోజున తిరుపతి నెహ్రుమున్సిపల్‌ స్కూల్‌, 6న మదనపల్లె జెడ్పి స్కూల్‌, అదే రోజు కుప్పం జెడ్పిస్కూల్‌, 7న నగరి ప్రభుత్వ కళాశాల, అదే రోజున పీలేరు ప్రభుత్వ కళాశాల, 8న శ్రీకాళహస్తి జెడ్పి ఉన్నత పాఠశాల , అదే రోజు సత్యవేడు జెడ్పి ఉన్నత పాఠశాలలోను వృద్ధులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాలకు వృద్ధులు, పెన్షనర్లు హాజరై, పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఫోన్‌నెంబరు:: 08572-242253, సెల్‌: 9849890102 లను సంప్రదించాలన్నారు.

 

Tag : Conferences for older persons on central government schemes

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *