అయోమయంలో టీబీజేపీ నేతలు

Date:14/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
సార్వత్రిక ఎన్నికలలో నరేంద్రమోఢీ హవాతో సొంతంగా కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న బిజెపి తెలంగా ణలో మాత్రం పుంజుకోలేకపోతుంది. గత ఎన్నికలలో టిడిపితో జతకట్టి కేవలం ఒక్క పార్లమెంటు, ఐదు అసెంబ్లీ స్థానాలను మాత్రమే కైవసం చేసు కుంది. బిజెపి జాతీయ నాయకత్వం రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించినా రాష్ట్ర నేతలు మాత్రం తమ కార్యాచరణను ప్రకటిం చడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడడం, టిడిపి నుండి టిఆర్ఎస్ లోకి నేతలు జంప్ చేస్తుండడంతో ఉన్న పొలిటికల్ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవడంలో కాషాయ దళం విఫలమవుతుందన్న ఆరోపణలు వినిపి స్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండడంతో పార్టీకి కావాల్సిన అన్ని ముడ ిసరుకులు అందుబాటులో ఉన్నప్పటికి స్థానిక నాయకత్వం మాత్రం వాటిని వాడుకోవడం లేదు. తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ తో సమానంగా పోరాడి నప్పటికి ఆ మైలేజిని సొంతం చేసుకోవడంలో మాత్రం బిజెపి నేతలు విఫలమ య్యారు. టిడిపితో పొత్తు ఉండడం వల్లే పార్టీకి నష్టం జరుగుతుందని పైకి చెబుతున్నప్పటకి వాస్తవానికి పార్టీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడంలో స్థానిక నేతలు దారుణంగా విఫలమవుతున్నారు. సిద్దాంతాల ప్రాతిపాదికన రాజకీ యాలు చేసే పార్టీగా గుర్తింపుఉన్న బిజెపి తెలంగాణలో ఎందుకు ఎదగలేక పోతుంది? దక్షణాది రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుం టున్నామని అగ్రనేతలు చెబుతున్న మాటలు నీటిమూటలేనా? బిజెపి ఎప్ప టికైనా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యే పార్టీనా అన్న చర్చ జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందే ఏర్పడిన తెలంగాణలో టిడిపితో కలసి ఎన్నికలలో పోటీచేసినప్పటికి ఆ పార్టీకి అనుకున్నన్ని స్థానాలు రాలేదు. సికింద్రబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బండారు దత్తాత్రేయ ఒక్కరే ఎంపిగా గెలుపొందారు. గ్రేటర్ హైదరాబాద్ పరిదిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు. అయితే టిడిపితో పొత్తు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి ఉపయోగపడినా తెలంగాణలో మాత్రం పార్టీకి నష్టం కలిగించిందని కమల నాథులు భావించారు. ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వాన్ని ఒప్పించి ఇపుడిపుడే తెలంగాణలో టిడిపిని వదలిపెట్టడానికి సిద్దపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలలో కలిసి పోటీచేసినప్పటికి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అగ్రనేతలు సైతం టిడిపిని వది లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికలలో బిజెపి ఒంటరిగానే పోటీ చేసింది. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ఒకపుడు పార్టీకి కంచుకోట. రెండు సార్లు కరీంనగర్ ఎంపితో పాటు మెట్‌పల్లి, సిరిసిల్ల, కోరుట్ల తదితర అసెంబ్లీ సెగ్మెంట్లలో బలంగా ఉండేది. ప్రస్తుత మహరాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి, పి.మురళీధర్‌రావు వంటి జాతీయ స్థాయి నేతలు ఆ జిల్లాలో ఉన్నారు. అయినప్పటికి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంలో మాత్రం విఫలమవుతున్నారు. వరంగల్ జిల్లాలో మార్తినేని ధర్మారావు, డా. టి రాజేశ్వరరావు, వేణుగోపాల్‌రెడ్డి, రావు అమరేం దర్‌రెడ్డి వంటి కీలకమయిన నేతలు ఉన్నారు. ఇక మహబూబ్‌నగర్‌లో నాగం జనార్దన్‌రెడ్డి, టి. ఆచారి, నిజామాబాద్‌లో యెండల లక్ష్మినారాయణ వంటి సీని యర్ నేతలు ఉన్నప్పటికి వారి సేవలను వాడుకోవడంలో పార్టీ అధిష్ఠానం సీరి యస్‌గా దృష్టిపెట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామస్థాయిలోకి పార్టీని తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణలు కూడా ప్రకటించలేదు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే దానికి ఒక స్పష్టమైన ప్రణాళిక అవసరం. దీనిని రూపొందించడంలో నేతలు విఫల మయ్యారు.. టిడిపిని టార్గెట్ చేసిన టిఆర్ఎస్ విజయవంతంగా ఆపరేషన్ ఆకర్ష్‌ను ముగించింది. కేవలం టిడిపికి ఇపుడు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఈ పరిస్థితులలో ప్రత్యా మ్నాయ రాజకీయ పార్టీగా తెలంగాణలో ఎదిగేందుకు బిజెపి కి అన్ని అవకా శాలు ఉన్నప్పటికి రాష్ట్ర నేతలు మాత్రం తమకేం పట్టింపు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. పదవులను ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటకి కనీసం నాలుగు పార్లమెంటు స్థానాలు 30 అసెంబ్లీ స్థానాలలో గెలుపే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
Tags: Confused TBJP leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *