జగన్ న అభినందించాలి-ఎమ్మెల్యే వంశీ

విజయవాడ ముచ్చట్లు:
 
కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు సీఎం జగన్మోహన రెడ్డిని అభినందించాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు.చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ పేరు పెట్టకలేకపోయాడని విమర్శించారు. ఇప్పుడు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన జగన్మోహన్ రెడ్డిని కనీసం అభినందించటంలేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నుంచి ఇప్పటి వరకూ ఎంతో మంది నాయకులు పదవులు అనుభవిస్తున్నారంటే అన్న ఎన్టీఆర్ పెట్టిన భిక్షేనని వ్యాఖ్యానించారు. గతంలో పాదయాత్ర లో జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ పేరు పెడతానంటే ఆ మాట చంద్రబాబు నాయుడు కు చెబితే హెద్దేవా చేశారని పేర్కొన్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags; Congratulations on the pics-MLA Vamsi

Natyam ad