Congratulations to Chandrababu

చంద్రబాబుకు శుభాకాంక్షల వెల్లువ

-నూతన సంవత్సరాన బిజీబిజీగా సీఎం

Date : 01/01/2018

విజయవాడముచ్చట్లు:

నూతన సంవత్సర వేడుకలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం బిజీబిజీగా గడిపారు. ఉండవల్లిలోని తమ నివాసంలో చంద్రబాబు దంపతులు ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌, డీజీపీ మాలకొండయ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సీనియర్ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, తెదేపా కార్యకర్తలు, మహిళా నేతలు సీఎంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీఎండీసీ డైరీని చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. అంతకముందు ఉదయాన్నే లేచి తనను కలవడానికి వచ్చిన వారి ముందుకు చేరుకున్న ఆయనకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారుల సమక్షంలో నూతన సంవత్సరం కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ఉద్యోగులు, ఉద్యోగ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి పాత్రికేయుల సమావేశంలొ పాల్గొన్నారు. పాత్రికేయుల సమావేశం అనంతరం స్థానిక నాయకులు నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వీకరించారు. అంతకముందు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు ఉమ్మడిగా వేడుకలు నిర్వహించుకునే సంస్కృతి ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ సమీపంలోని బరంపురంలో ఆలిండియా సర్వీసెస్ సెలభ్రేషన్స్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అధికారుల సహకారంతో మూడేళ్ళలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. భవిషత్తులోనూ వారి సహకారం ఇలాగే ఉండాలని విజ్ణప్తి చేశారు. 2017లో పోలవరం ప్రాజెక్టును కీలక స్థాయికి తెచ్చామని, పట్టిసీమ ద్వారా 105 టీఎంసీల నీటిని అందించి కోస్తాలో ఖరీఫ్ పంటలను కాపాడామన్నారు. భవిష్యత్‌లో అధికారుల సహకారం ఉంటే మరెన్నో విజయాలు సాధించి రాష్ట్ర ప్రజలకు ఉజ్వల భవిషత్తును ఇవ్వగలుగుతామన్నారు. ‘‘భారత్లో కుటుంబ వ్యవస్థ ఘనమైనది, ఆదర్శవంతమైనది’’ అని ముఖ్యమంత్రి ప్రశంసించారు. మహిళల సహకారం, తోడ్పాటు లేకపోతే ఎంతటి ప్రజాపాలకులైనా, అధికారులైనా విధులు సక్రమంగా నిర్వహించలేరని పేర్కొన్నారు. తన భార్య హెరిటేజ్ వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించడమే కాకుండా కుటుంబాన్నీ చక్కగా చూసుకోవడం మూలంగానే తాను పరిపాలనపై దృష్టి పెట్టగలిగానన్నారు.

Tags : Congratulations to Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *