కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెప్ కసరత్తు

Date:19/02/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. ఏపీకి విభజన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ ప్రభుత్వాన్ని పార్లమెంట్లో నిలదీయడానికి అవిశ్వాసమే సరైన మార్గమనుకొంటోంది కాంగ్రెస్. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, జేడీ శీలం, టీ సుబ్బరామిరెడ్డి తదితరులు రాహుల్ గాంధీని కలిసి, కేంద్రంపై అవిశ్వాసం పెడదామని అడిగారు.  అప్పుడు ఏ పార్టీ కలసి వస్తుందో ప్రజలకు తెలుస్తుందని చెప్పగా, అందుకు రాహుల్ గాంధీ కూడా అంగీకరించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అవిశ్వాసం పెట్టేందుకు రాహుల్ గాంధీ అంగీకరించినట్టు సమాచారం. ఇప్పటికే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటూ పవన్ కళ్యాణ్  డిమాండ్ చేయడం.. వైఎస్ జగన్ కూడా సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా దీనిపై చర్చించడం జరిగింది. మార్చి 5 నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండడంతో, ఆ లోపే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tags: Congregational work on the no-confidence motion on the central government

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *