ఎల్లంపల్లి నీటితో నారాయణ పూర్ రిజర్వాయర్ నింపాలని కాంగ్రెస్ పార్టీ దర్నా

చొప్పదండి ముచ్చట్లు:
 
ఎల్లంపెల్లి నీటితో నారాయణపూర్ రిజర్వాయర్ నింపి ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా గంగాధర క్రాస్ రోడ్డు చౌరస్తాలో  కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి
దిగ్బంధ నిరసన దర్నా కార్యక్రమాన్ని రైతులు కాంగ్రెస్ నాయకులతో కలిసి చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మేడిపల్లి సత్యం ఆద్వర్యంలో నిర్వహించారు. .ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం
మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గం కేంద్రంగా నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని, చొప్పదండి నియోజకవర్గాన్ని కోనసీమగా మార్చామని ప్రగల్భాలు
పలుకుతున్న ఎమ్మెల్యే కి ఎండిపోయిన పొలాలు కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఇక్కడి రైతుల పొలాల మధ్య నుండే కాలువలు తోడుకుంటూ అక్రమంగా నీటిని ప్రభుత్వ పెద్దల నియోజకవర్గాలకు
తరలిస్తుంటే ఇక్కడి ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఇలాంటి బానిస నాయకులని గ్రామాల్లో తిరగకుండా అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు.24 గంటల్లో
నారాయణపూర్ రిజర్వాయర్ కి నీటిని విడుదల చేయాలని లేకుంటే  రాబోవు రోజుల్లో రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు మరిన్ని చేపడతామని హెచ్చరించారు. ధర్నా చేస్తున్న నాయకుల
 
 
పైన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఒకదశలో కార్యకర్తలకు పోలీసులకు తోపులాట చోటుచేసుకుంది. అనంతరం రైతులను కాంగ్రెస్ కార్యకర్తలను చొప్ప దండి సి ఐ నాగేశ్వరరావు, ఎస్ ఐ నరేష్
రెడ్డి లు గంగాధర పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో ఐదు మండల అధ్యక్షులు పురుమల్ల , మనోహర్,ఇప్ప శ్రీనివాస్ రెడ్డి బొమ్మరవేణి తిరుపతి, వన్నెల రమణారెడ్డి, చెలివేరి నారాయణ, బ్లాక్
కాంగ్రెస్ అధ్యక్షులు భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి, దుబ్బాసి బుచ్చన్న,బుర్గు గంగన్న,పురం రాజేశం, కూస రవిందర్,పెరుమండ్ల గంగన్న, కొట్టే అశోక్, జవ్వాజి హరీష్, గడ్డం జీవన్,శోభన్,బత్తిని శ్రీనివాస్, కాడే
శంకర్,ముద్దం తిరుపతి,కాడరి మల్లేశం,తొట కరుణాకర్, ముత్యం శంకర్,వినోద్,కొల ప్రభాకర్, అజయ్,నాగుల వంశీ,సాన సత్యం, ప్రశాంత్, మరియు, రైతులు పాల్గొన్నారు.
 
Tags:Congress party wants to fill Narayanapur reservoir with Ellampalli water

Natyam ad