Congress's sensational decision ... to prepare for great sacrifice for victory ...

కాంగ్రెస్ సంచలన నిర్ణయం… గెలుపు కోసం గొప్ప త్యాగానికి సిద్ధం…

Date:16/06/2018

న్యూఢిల్లీ ముచ్చట్లు:

నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దె దించాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి త్యాగాలైనా చేసి, నరేంద్ర మోదీకి షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 2019 లోక్‌సభ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంత తక్కువ స్థానాల నుంచి పోటీ చేయబోతోంది.రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ మహా కూటమిని ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కూటమిలోకి వచ్చే పార్టీలకు ఎక్కువ స్థానాలను ఇచ్చేందుకు వీలుగా తాను స్వయంగా తక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 250 లోక్‌సభ స్థానాల నుంచి మాత్రమే పోటీ చేయాలనే అంశంపై తర్జనభర్జన జరుగుతున్నట్లు తెలిపాయి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే రూపొందినట్లు పేర్కొన్నాయి. దీనిపై కాంగ్రెస్‌లో విస్తృత చర్చ జరిగిన తర్వాత రాహుల్ గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపాయి.కాంగ్రెస్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వైఖరిని రూపొందించేందుకు ఏ కే ఆంటోనీ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ కమిటీ కాంగ్రెస్ జిల్లా, రాష్ట్ర కమిటీలకు లేఖలు రాసింది. ప్రజల ఆకాంక్షలు, పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి సమాచారం పంపించాలని కోరింది.కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నిష్కళంక చరితులకు మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలని కొందరు నేతలు గట్టిగా కోరుతున్నట్లు సమాచారం.

 

Tags; Congress’s sensational decision … to prepare for great sacrifice for victory …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *